ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో

 మని అలంపూర్ జూన్ 7 జనంసాక్షిఅలంపూర్ నియోజవర్గంలో రైతులకు సాగని సాగనీరు ఇవ్వని శతాబ్ది ఉత్సవాలు ఎందుకు, ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాల ఆపాలని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాగశిరోమని అన్నారు.బుధవారం అలంపూర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులు మల్లమ్మ కుంట ఆర్ డి ఎస్ ల ను ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు *డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరోమని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు చేపట్టిన దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ప్రజానీకానికి సిగ్గుచేటని, అలంపూర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. 9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఎక్కడ సాగునీరు అందించారని ప్రశ్నించారు.మన అలంపూర్ లో పత్తి ,మిరప ,మొక్కజొన్న రైతులు సాగునీరు అందక పంటలు ఎండిపోయి కంటతడి పెట్టుకుంటుంటే మీకు దశాబ్ద ఉత్సవాల పేరుతో సంబరాలు చేసుకోవడం విచారకరమని అన్నారు.గతంలో15,000 మందితో సింధనూరు దగ్గర ఆర్డీఎస్ పై మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ దీక్ష చేసి తుమ్మిళ్ల లిఫ్ట్ ను సాధిస్తే, టిఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ళు కావస్తున్న ఏ రిజర్వాయర్లో తట్ట మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ హయాంలో నెట్టపాడు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు.సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే టిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోవడం విచారకరమన్నారు.ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాలకు అందాల్సిన నీరు కనీసం 15, వేల ఎకరాలకు కూడా అందని దౌర్భాగ్యస్థితి అలంపూర్ లో ఉందని మీకు చేతనైతే సంబరాలు ఆపి మొత్తం ఎకరాలకు నీరు పారించే విధంగా చర్యలు తోసుకోవాళన్నారు.
ఎన్నికల ముందు దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలని ప్రజలఅభివృద్ధి వైపు చూడాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు ,వడ్డేపల్లి మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ,ఇటిక్యాల మండలం అధ్యక్షులు రుక్మనందరెడ్డి ,ఐజ మండల అధ్యక్షులు ఉత్తనూరు జయన్న, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దిలేటి ,డిసిసి స్పోక్ పర్సన్ మైనర్ బాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవేందర్ ,ఐజ దేవేందర్ బసవరాజు యూత్ కాంగ్రెస్ వడ్డపల్లి అధ్యక్షులు కృష్ణ కాంత్ కుమార్ తనగల రైతులు స్థానికులు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.