ఎమ్మార్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ విచారణ

హైదరాబాద్‌: ఎమ్మార్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఈరోజు విచారణ చేపట్టింది.దీనికి ఎమ్మార్‌ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కేసులో త్వరగా కౌంటర్‌ దాఖలు చేసి ఈడీకి అందించాలని ఎమ్మార్‌ను న్యాయప్రాధికార సంస్థ ఆదేశించింది.  సంస్థ ఆదేశాల మేరకు ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌కౌంటర్‌ దాఖలు చేసింది. అనంతరం ఈకేసు విచారణను ఈనెల 19 కి వాయిదా వేస్తున్నట్లు ఈడీ న్యాయప్రాధికార సంస్థ వెల్లడించింది.