ఎర్రచందనం స్వాధీనం

సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి పింఛ అటవిప్రాంతం నుంచి జిలెల్లమంద బీటుసున్నపుగుండు సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాథీనం చేసుకొని 10 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. వీరు చిత్తూరు జిల్లా కలపడ మండలం నాయినివారిపల్లెకు చెందినవారుగా గుర్తించారు.