ఏలూరుకు ముంపు ప్రమాదం

దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పోంగి ప్రవహిస్తున్నాయి. తమ్మిలేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఏలూరు నగరానికి ముంపు ప్రమాదం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏలూరు మార్కెట్‌ యార్డ్‌ వద్ద తమ్మినేరు కాలువకు రెండు గండ్లు కోట్టించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని మళ్లించారు. ఈ రెండు గండ్ల ద్వారా పెద్దమొత్తంలో నీరు బయటకు పోతోంది.