తాజావార్తలు
- డిసిసి భవన్ లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి
- ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
- జాతరలో తప్పిపోయిన చిన్నారి
- మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సర్పంచ్
- పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు
- డ్రగ్స్ పై ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం
- నేడు సమ్మక్క ‘ఆగమనం’…!
- నో- డ్యూ కోసం నేతల పడిగాపులు
- గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవు
- బైక్ పై పొంగులేటి …
- మరిన్ని వార్తలు
ఒకటి సిఓఈ సెట్ కాగా మరొకటి యుజి సెట్ – ఉదయం 10గంటలనుండి మధ్యాహ్నం 1గంటల వరకు సిఓఈ సెట్- మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు యూజి సెట్. – ఆదిలాబాద్ రీజియన్ లో సిఓఈ సెట్ కు14, యుజి సెట్ కు 6 పరీక్షాకేంద్రాలు. – సిఓఈ సెట్ కు 6719, యుజి సెట్ కు 2207 దరఖాస్తులు. బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సిఓఈ సెట్-2023) మరియు తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్( టిజి యూజి సెట్) లకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపరాణి తెలిపారు. సిఓఈ ల్లో ఇంటర్ అడ్మిషన్స్ కోసం జరిగే సిఓఈ సెట్ పరీక్ష ఉదయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ డిగ్రీ కాలేజీల్లో అడ్మీషన్స్ కోసం టిజి యూజి సెట్ మధ్యాహ్నం 2.30 ని.లనుండి 5గంటల వరకు జరుగుతుందన్నారు.



