ఓటు హక్కుపై విశాఖలో సైకిల్‌ ర్యాలీ

విశాఖ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ ఆర్కే బీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఓటు హక్కు వినియోగం వల్ల జరిగే లాభాలను వివరిస్తూ పలు ప్రదర్శనలు ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన యువకులంతా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా జేసీ ప్రమీణ్‌ కుమార్‌ కోరారు.

తాజావార్తలు