కంటి వెలుగు తెలంగాణ వెలుగు…. కంటి వెలుగు ప్రారంభించిన ఎంపీపీ

 

డోర్నకల్ ప్రతినిధి మార్చి 15 (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో రూపుల తండా శివారు ప్రభుత్వ పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ఎంపీపీ సుశీల, యాదగిరి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సుశీల ,యాదగిరి రెడ్డి మాట్లాడుతూ
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.వైద్యాధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో, వైస్ ఎంపీపీ దేవేందర్ ,సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, ఉపసర్పంచ్ నాగేష్, పార్టీ అధ్యక్షుడు శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ ,ఎంపీవో సోమలాల్, బీఆర్ఎస్ నాయకులు ,ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.