కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు
హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): పట్టణంలోని
గోవిందపురంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం కన్నుల పండుగా శ్రీరామ నవమి వేడుకలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట ఎనిమిది గంటలకి పంచామృత అభిషేకం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తర శతనామక పూజా కార్యక్రమం నివేదన జరబడింది. తదుపరి సీతారామస్వామి కళ్యాణం ఎంతో అత్యంత వైభవోపేతంగా అర్చకులు నరిగిరి నాధుని రంగ చార్యులు, మోహన్ వంశీ చే జరుపబడింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, స్వామివారి పాదపక్షాలన, మహా సంకల్పం, మాంగల్య సూత్రం పూజ జరిపించి స్వామివారి చేత అమ్మవారికి ధరింపజేయబడినది. ఈ కార్యక్రమంలో భక్తులు కె. వెంకటేశ్వర్లు, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, కోలా నాగేశ్వరరావు, జి. వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి, డి. వెంకట్ రెడ్డి, లింగయ్య, రవీందర్ రెడ్డి, ధనుంజయ, రాజు, శ్రీనివాసు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.