కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబయి: ముంబయి దాడుల (26/11) కేసులో తనకు క్షమాభిక్ష ప్రసాదిచాలని కోరుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌(25) సమర్పించిన పిటిషన్‌ను మహారాష్ట్ర హోంశాఖ తిరస్కరించింది. కసబ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడంపై తమ అభిప్రాయాన్ని వెల్లడించి, ఈ పిటిషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు హోంశాక వర్గాలు సోమవారం తెలిపాయి. నింబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్‌ తొలుత రాష్ట్ర హోంశాఖకు, తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని సీఎం కార్యాలయం పరిశీలించి కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది. రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్ర హోంశాఖ సదరు పిటిషన్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తుంది. ముంబయి దాడుల కేసులో కసబ్‌కు దిగువ న్యాయస్థాణం విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే.