కాంగ్రెస్‌, తెదేపా కార్యకర్తల దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయలు

కర్నూలు: జిల్లాలో కాంగ్రెస్‌ తెదేపా కార్యకర్తల దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డోన్‌ మండలం కొత్త బురుజు గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రేగిన వివాదం ఘర్షణగా మారి పరస్పర దాడులకు దారితీసింది. కత్తులతో తలపడటంతో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.