కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా మహేష్ రెడ్డి బచ్చన్నపేట (జనం సాక్షి):


జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా నూకల మహేష్ రెడ్డి. ఉపాధ్యక్షునిగా చిలుక ప్రవీణ్. ప్రధాన కార్యదర్శిగా నూకల రవీందర్ రెడ్డి. గ్రామ కార్యదర్శిగా శివరాత్రి సిద్ధులు. గ్రామ కోశాధికారిగా. నూకల రాజిరెడ్డి. భూపాల్ రెడ్డి రాజేష్ కన్న లను కమిటీగా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు అధ్యక్షుడు మహేష్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు…