కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్ని ప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్‌ జిల్లాలో కిరోసిన్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం 15 వాగన్లు ఆహుతయ్యాయి. ఈ ఘటనతో ఇంజిన్‌ సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.