కేసీఆర్‌ వాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధంలేదు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందన్న కేసిఆర్‌ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్‌రకు సంబంధంలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి రేణుక చౌదరి పేర్కొన్నారు. ఈమె పార్టీ ప్రధాన కార్యలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల తర్వాత చర్చించి చెపుతామన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి అజాద్‌ అనారోగ్యంతో ఉండడంతో ఆయన కోలుకున్నాతర్వాతే ఎదో ఒక నిర్ణయం ఉంటుందని  అన్నారు.అగస్టులో నిర్ణయం ఉంటుందన్న వార్తల గురించి అడిగినప్పుడు ”అంధ్ర రాష్ట్రంలో అన్ని ముఖ్య నిర్ణయాలు అగస్టులోనే ఉంటాయని అన్నారు. అప్పుడు అందరికి చెపుతామని దాటావేశారు. తెలంగాణా ఇస్తే తెరాసను విలీనం చేయాలని ప్రతిపాదిస్తారా,అని అడగ్గా ఇప్పుడు అంతవరకు రాలేదు కాబట్టి తానేమి మాట్లాడలేమని అన్నారు. కాంగ్రేస్‌ వైఖరి చెబితే మిగితవారు చెప్పడానికి వీలవుతుందన్న చిదంబరం వాఖ్యలను ప్రస్తావించగా ….ఏదో ఒక రోజు ఆ నిర్ణయానికి రావల్సి ఉంది.అంతలోపు తొందర పడాల్సిన అవసరం లేదని అన్నారు.