కేసీ కెనాల్‌కు తాగునీటి కోసం రైతుల ఆందోళన

కడప: కేసీ కెనాల్‌కు తాగునీరు ఇవ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. స్థానికులతో కలిసి రైతులు ఈ ఉదయం మైదుకూర్‌లోని జాతీయరహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో రహదారిపై వాహనాలు  నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.