కైగల్‌ జలపాతం వద్ద ప్రేమజంటపై దుండగుల దాడి

 

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడిచేశారు. వారు యువతిపై అత్యాచారం చేసి, యువకుడిపై కత్తితో దాడిచేశారు.రంజిత, మునిరాజు అనే ఈ యువతీయువకులు కర్ణాటకలోని బంగారుపైట వాసులుగా గుర్తించారు. వారిద్దరినీ చికిత్స కోసం వికోట అస్పత్రికి తరలించారు.