కోతలపై డిస్కింల వద్ద ధర్నాకు తెదేపా నిర్ణయం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై తెదేపా శాసనసభా పక్ష భేటీ ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ముగిసింది. మధ్యాహ్నాం 3 గంటలకు మరోసారి సమావేశం కావాలని నేతలు నిర్ణయించారు. విద్యుత్‌ కోతలపై డిస్కింల వద్ద ధర్నా చేయాలని నేతలు ఈ భేటీలో నిర్ణయించారు.  ఈ నెల 29న హైదరాబాద్‌లో, వచ్చే నెల 1న వరంగల్‌లో, 2న తిరుపతిలో, 3న విశాఖలో ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టనున్నట్లు తెలయజేశారు.