కోదండరాం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కోదండరాం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తాను కరీంనగర్‌ జిల్లా ప్రజలకోసమే పనిచేస్తున్నానని ఎవరో మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌గా ఉన్న కోదండరాం గాంధేయవాదం  బోధించాలి తప్ప… హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యాలు చేయడం ఏమేరకు సబవం అన్ని శ్రీధర్‌బాబు ప్రశ్పించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు.