క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకోవాలి: దయాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజ్యసభలో ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎంపీల తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయన్నారు. చీమునెత్తురు ఉంటే తక్షణమే వారు పదవులనుంచి తప్పుకోవాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారికి కీలక పదవులిస్తే చంద్రబాబునే మోసం చేశారంటూ దుయ్యబట్టారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ముగ్గురు నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు.