గాంధీభవన్‌ ఎదుట వికలాంగుల ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్‌ నాంపెల్లిలోని గాంధీభవన్‌ ఎదుట ధర్నాకు దిగిన వికలాంగులు కమిషనర్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. వికలాంగులు ఎదుర్కోంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల పెన్షన్‌ను రెండు వేలకు పెంచడంతో పాటు ఉద్యోగాలను వికలాంగులతో భర్తీ చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.