గెట్ ఔట్ అంటూ అవమానం… ఆర్పి ఉద్యోగి రాజీనామా..

 

 

 

ఆర్మూర్, మే 15 ( జనం సాక్షి):

– మహిళ ఉద్యోగితో ఎమ్మెల్యే పైడి రాకేష్ దురుసు వ్యాఖ్యలు.

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా విధులు నిర్వహించిన ఓ మహిళ ఆర్పి ఉద్యోగితో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన దురుసు వ్యాఖ్యలకు సదరు మహిళ మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన రాజీనామా లేఖ దుమారం రేపుతోంది.లోక సభ ఎన్నికల్లో బూతు నెంబర్ 54 లో విధులు నిర్వహించిన దొండి గంగామణిని గెట్ అవుట్ అని బెదిరిస్తూ బయటకు పంపారని లేఖలో పేర్కొన్నారు.గత 14 సంవత్సరాలుగా ఆర్పిగా నిధులు నిర్వహిస్తున్నానని,మహిళా ఉద్యోగితో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే దురుసు ప్రవర్తనతో బయటకు పంపడం అవమానకరంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కు వివరించారు.ఇందుకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదే అంటూ లేఖలో పేర్కొన్నారు.