గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి

ఇచ్చోడ : ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలోని సుభాష్‌నగర్‌లో ప్రహరీగోడ కూలి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పురాతన గోడ వద్ద చిన్నారులు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు.