చికిత్స పొందుతూ రవీందర్‌ రెడ్డి మృతి


రియల్టర్‌ హత్యపై ఆరా తీస్తున్న పోలీసులు
హైదరాబాద్‌,అక్టోబర్‌28  (జనంసాక్షి):  కత్తి దాడికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రియల్టర్‌ రవీందర్‌ రెడ్డి మృతి చెందారు. రవీందర్‌ రెడ్డిపై కత్తితో అల్లుడు మోహన్‌ రెడ్డి దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అపోలోలో చికిత్స పొందుతూ రవీందర్‌ రెడ్డి మరణించారు. రవీందర్‌ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రవీందర్‌ రెడ్డి పని చేశారు. రెండేళ్ల కిందట బేగంపేట ప్రాంతంలో దాదాపు 600 గజాల స్థలాన్ని రవీందర్‌రెడ్డి కొనుగోలు చేశారు. స్థలం కొనుగోలులో మోహన్‌ రెడ్డి మధ్యవర్తిత్వం వహించాడు. తనకు రావాల్సిన కమిషన్‌ డబ్బులు ఆరు లక్షలు ఇవ్వకపోవడంతో మోహన్‌ రెడ్డి కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. తన కమిషన్‌ ఇవ్వకుండా రెండు నెలల క్రితం రవీందర్‌ రెడ్డి ఆ స్థలాన్ని రిజిస్టేష్రన్‌ చేయించుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో హతమార్చాలని భావించి రవీందర్‌రెడ్డిపై మోహన్‌ రెడ్డి కత్తితో దాడి చేశాడు. అయితే రియల్టర్‌ రవీందర్‌ రెడ్డి హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. రవీందర్‌ రెడ్డి దగ్గర నిందితుడు మోహన్‌ రెడ్డి పదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హత్యకు కేవలం కవిూషన్‌ వ్యవహారం కారణం కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య వ్యవహారంలో కుట్ర ఉందని రవీందర్‌రెడ్డి భార్య అమూల్య రెడ్డి చెబుతున్నారు. అయితే హత్యకు ఈ కవిూషన్‌ వ్యవహారమే కారణం కాకపోవచ్చని.. పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.