చెరువులకు పూర్వవైభవం

ee4jdsz8హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మిషన్ కాకతీయ ప్రచార రథాన్ని మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.