జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారుల ప్రదర్శన- జిల్లా కలెక్టర్ హరీశ్

మేడ్చల్(జనంసాక్షి):  స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 14న ఆదివారం తెలంగాణ సాంస్కృతిక సారధి సమన్వయంతో జానపద కళాకారుల ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు జానపద కళాకారుల ప్రదర్శనను జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆదివారం జిల్లా, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కళాకారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా చోట్ల యువకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా సంబంధిత శాఖల అధికారులు చూడాల్సిందిగా కలెక్టర్ హరీశ్ సూచించారు. అలాగే ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రాల్లో బాణాసంచా వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూడాల్సిందిగా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు.