ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గేట్‌మన్‌ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.