డిసెంబరు కరెంటు బిల్లులో మినహాయించుకోండి: సీపీడీసీఎల్‌

హైదరాబాద్‌: సీపీడీసీఎల్‌ పరిధిలోని ఎల్‌టీ వినియోగదారులు జూన్‌ 2010, హెచ్‌టీ వినియోగదారులు మే-2010కి సంబంధించి ఇంధన సర్‌ఛార్జీల మొత్తాన్ని డిసెంబరు 2012 విద్యుత్‌ బిల్లుల్లో మినహాయించుకుని చెల్లించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులు, వినియోగదారులనుంచి ఛార్జీల వసూళ్లలో ఈ మార్పులు చేసినట్లు సీపీడీసీఎల్‌ తెలిపింది. కోర్డు ఆదేశాల కన్నా ముందే సీపీడీసీఎల్‌ ఇంధన సర్‌ఛార్జీల డాటా సర్వర్‌లో ఎల్‌టీ, హెచ్‌టీ బిల్లుల డాటాను ఎక్కించడం వల్ల కోర్టు తీర్పు ప్రకారం తాజా బిల్లులను సవరించడం సాంకేతికంగా సధ్యం కవావడం లేదని తెలిపారు. అందుకోసమే డిసెంబరు 2012 బిల్లుల్లో ఆ మొత్తాన్ని మినహాయించుకుని చెల్లించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే బిల్లుల చెల్లించినవారికి రాబోయే నెలల బిల్లుల్లో ఆమొత్తాన్ని తగ్గిస్తామని సీపీడీసీఎల్‌ స్పష్టం చేసింది.