ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేయించారు. పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలు చేస్తున్నారు.