తెలంగాణ జాగృతిని పటిష్టం చేస్తం : కవిత
హైదరాబాద్: తెలంగాణ జాగృతిని పటిష్టం చేయనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తెలంగాణలోని పది జిల్లాలో సంస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 29న జరిగే ‘ దీక్షా దివస్’లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నాలని కవిత పిలుపునిచ్చారు.