తెలంగాణ వాదనకు అడ్డుచెప్పడం లేదు : గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ కావాలన్న వాదనకు తాను అడ్డుచెప్పడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గాదె వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీఎల్‌పీ కార్యలయంలో విలేకర్లతో మాట్లాడారు. తమ నిర్ణయాన్ని మాత్రమే తెలియజేశామని ఆయన అన్నారు. నాయకుల మధ్య ద్వేషాలున్నాయన్న విష ప్రచారం మంచిది కాదని ఈ సందర్భంగా ఆయనమీడియాను కోరారు.