నకిలీ పాసుల వ్యవహారంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగులు

హైదరాబాద్‌: నకిలీ పాసుల తయారీలో కొంత మంది ఆర్టీసీ మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని ఎండీ ఏకే ఖాన్‌ తెలియజేశారు. ఇటివల నకిలీ పాసులతో పట్టుబడిన 290 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నకీలి పాసులతో చిక్కితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జూలై 1 నుంచి ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉందని ఆయన అన్నారు. 210 డిపోల్లో 73 ఇప్పటికే లాభాల బాట పట్టాయన్నారు.