నాలుగు నెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి : భారతీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ అధిక్యాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో మార్కెట్‌ నాలుగునెలల గరిష్టానికి చేరడం విశేషం. సెన్సెక్స్‌ 226.37 పాయింట్ల అధిక్యంతో 17,618.35 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 70.20 పాయింట్ల లాభంతో 5,345.35 వద్ద ముగిశాయి. స్పానిష్‌బ్యాంకులను అదుకునేందుకు యూరోజోస్‌లోని మంత్రులు ఒక అంగీకారానికి రావడంతో మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. మూలధన వస్తువులు, ఎఫ్‌ఎంసీజీ, వాహన, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన షేర్లు లాభాలను పొందాయి. సెన్సెక్స్‌లోని 30 స్క్రిప్‌ల్లో 28 లాభాలతో ముగిశాయి.

భారతీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ అధిక్యాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో మార్కెట్‌ నాలుగునెలల గరిష్టానికి చేరడం విశేషం.