నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెయిల్‌ నిరాకరణ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో పారిశ్రమికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. మే నెలలో అరెస్టయిన నిమ్మగడ్డ దాఖలుచేసిన మొదటి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్‌ వ్యవహారంలో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ వాదించింది. అయితే  సీబీఐ ఇప్పటికే సాక్ష్యాలన్ని సేకరించిందనీ తాను దర్యాప్తునకు  పూర్తిగా సహకరించినందున బెయిల్‌ ఇవ్వాలని నిమ్మగడ్డ ప్రసాద్‌ కోరారు. ఇరువైపుల సుదీర్ఘవాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.