నిరుపేదలకు కంటి వెలుగు ఓ వరం

 

మోత్కూరు మార్చి 11 జనంసాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెకు కంటి వెలుగును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పొడిచేడు గ్రామ సర్పంచ్ పేలపూడి మధు అన్నారు. శనివారం మండలంలోని పొడిచేడు గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ పేలపూడి మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానమని, పల్లెల్లోని నిరుపేద ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమం ఒక వరమని, గ్రామ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.