నేడు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌ : నీలం తుపాను వల్ల వరద ముంపునకు గురైన ప్రాంతాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం, బాధితులను పరామర్శించి సహాయకార్యక్రమాలను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు.