నేడు ముఖ్యమంత్రిని కలవనున్న తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో నేడు భేటీ కానున్నారు. తెలంగాణ కవాతుకు అనుమతి అంశానికి సంబంధించి వీరు సీఎంకు విజ్ఞప్తి చేయనున్నారు. నిన్న ఉదయం సమావేశమైన మంత్రులు ప్రభుత్వాన్ని ఒప్పించి కవాతుకు అనుమతి సాధించాలనే నిర్ణయానికి వచ్చారు. సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని ఆయనకు వివరించారు.