న్యాయవాది ఆధిత్యకు జ్యుడిషియల్ రిమాండ్
హైదరాబాద్: గాలి బెయిల్ ఫర్ సేల్ కేసులో న్యాయవాది ఆధిత్యకు ఏసీబీ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈరోజు కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను విచారించిన కోర్టు ఆగస్టు 2 వరకు రిమాండ్ విధిస్తున్నాట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తోన్నారు. గాలి న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు దగ్గర ఆధిత్య జూనియర్ న్యాయవాదిగా ఉండేవారు.