న్యూయార్క్‌ ఆసుపత్రిలో హిల్లరీ క్లింటన్‌కు చికిత్స

వాషింగ్టస్‌ : రక్తం గడ్డకట్టడంతో న్యూయార్క్‌ ఆసుపత్రిలో చేరిన అమెరికా విదేశంగా శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. శరీరంలో రక్తం గడ్డకట్టే లక్షణాలను వైద్యులు గుర్తించడంతో ఆమె ఆదివారం ఆసుపత్రిలో చేరారు. కుడి చెవికి వెనకభాగంలోని  నరంలో దీన్ని గుర్తించి చికిత్స అందించినట్లు వైద్యులు చెప్పారు.