పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డి ఎస్ పి వెంకటేష్.

 

 

 

 

 

– ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

– 281 మంది విద్యార్థులు హాజరు, 7 మంది గైర్హాజర్.

– కళాశాల ప్రిన్సిపాల్ జి. చీన్యా…

బూర్గుంపహాడ్ మార్చి 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమవగా డి ఎస్ పి వెంకటేష్ తమ సిబ్బందితో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులతో కలిపి మొత్తం 288 మంది విద్యార్థులు ఉండగా 281 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఏడు మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్ సూపరిటెండెంట్ జి. చీన్యా తెలియజేశారు. నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులను తనిఖీ బృందం తనిఖీ నిర్వహించారు. పరీక్షల నిర్వహణను పాల్వంచ డిఎస్పి వెంకటేష్, సిఐ నాగరాజు, అదనపు ఎస్సై భుక్యా శ్రీను తనిఖీ నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చీఫ్ సూపర్డెంట్ చీన్యా కు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.