పర్యాటక రంగ అభివృద్ధికి కొత్తపాలసీ
` తితిదే తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు
` హైదరాబాద్ బయట మరో జూపార్క్
` ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సవిూక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సచివాలయంలో నిర్వహించిన సవిూక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని చెప్పారు. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తితిదే బోర్డు మాదిరే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిలో పెండిరగ్ పనుల వివరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై వివరాలు ఇవ్వాలని సూచించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆపవద్దని స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేష్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
నా వ్యాఖ్యలు వక్రీకరించారు
` న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవం ఉంది
` సుప్రీంకోర్టుకు సీఎం రేవంత్ క్షమాపణలు
` ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి వెల్లడి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విషయంలో తన కామెంట్లు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని ఈ ట్వీట్‌లో వెల్లడిరచారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడిరచారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేవంత్.. శుక్రవారం ’ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ‘నా వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నిస్తున్నట్లుగా కొందరు ఆపాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా. న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను.. ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటా‘ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్‌కు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ’ముఖ్యమంత్రి ప్రకటనలను ఈ రోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయపార్టీలను సంప్రదించో.. లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా?’ అని ధర్మాసనం తీవ్రంగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు.