పార్‌థసారధి పిటిషన్ కిట్టివేత
హైదరాబాద్: విదేశాలకు అక్రమంగా డబ్బు తరలించారన్న ఈడీ కేసులో పార్థసారధికి, ఆర్ధిక నేరాల కోర్టు గత నెలలో రెండు నెలల జైలు శిక్ష, 5 లక్షల 25 వేల జరిమానా విధించింది. అయితే నాంపల్లి సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలుచేసిన పార్థసారధి జైలుశిక్ష నిలిపివేయాలని ఒక పిటిషన్, పూర్తి తీర్పును నిలిపివేయాలంటూ మరో పిటిషన్ దాఖలుచేశారు. అయితే పూర్తి తీర్పును నిలిపివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం పార్థసారధి పిటిషన్‌ను కొట్టివిసింది.