పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం..పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం.. – పేదింటి ఆడ బిడ్డలకు అండ బీఆర్ఎస్ జెండా.. మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి
శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 27 తొలి పొద్దు నే రసమయి పర్యటనబీఆర్ఎస్ పార్టీ జెండా పేదింటి ఆడ బిడ్డలకు కొండంత అండగా నిలిచిందని, ఇందుకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ పథకమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు
మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం తాడికల్, వంకాయగూడెం, మొలంగూర్, కేశవపట్నం గ్రామాలలో ఆయన తొలిపొద్దు పర్యటనలో భాగంగా ఈరోజు వేకువ జామున 6.30 గంటల నుండి ఉదయం 11.30 గంటల వరకు విస్తృతంగా పర్యటించారు
గ్రామాలలో కాలి నడకతో పాటు బైక్ పై తిరుగుతూ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కళ్యాణాలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అందిస్తూ, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సంధర్బంగా సీసీ రోడ్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు
పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు కార్యక్రమం లక్ష్యమని, సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పథంలో పయనించాలని ఎమ్మెల్యే రసమయి ప్రజలకు వివరించారు.. ఈ కార్యక్రమంలో శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ సర్పంచులు ఎంపీటీసీలు సిగ్నల్ విండో చైర్మన్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు