పోరాట స్ఫూర్తి దొడ్డి కొమరయ్య

బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 3:
తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమరయ్య అని. రైతుబంధు జనగామ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమరయ్య 96వ జయంతి ఉత్సవాలు . గ్రామ కురుమ సంఘం విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సమావేశానికి స్థానిక సర్పంచి తాతిరెడ్డి భవాని శశిధర్ రెడ్డి అధ్యక్షత వహించగా రమణారెడ్డి. బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యక్షులు బెజడి బీరప్ప. పడమటి కేశపురం సర్పంచి. గిద్దల రమేష్. కొన్నే ఎంపిటిసి మల్గా నరసమ్మ సిద్ధిరాములు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ. భూమికోసం. భుక్తి కోసం. వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి కొమురయ్య అని. నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమురయ్య అని అన్నారు. కొమురయ్య ఉద్యమ స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలని అన్నారు. గ్రామంలోని కురుమ యువకులు మంచిగా చదువుకోడానికి తన వంతు ఆర్థిక సాయం చేస్తానని రమణారెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం కురుమ పెద్దమనిషి ఐలయ్య.జూకంటి కిష్టయ్య . జంగిడి సిద్దులు. కురుమ కులస్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు