ప్రదానిని కలిసిన జైతాపూర్‌ పోరాట సంఘీభావ కమిటీ

న్యూడిల్లీ: ప్రతిపాదిత జైతాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం భద్రతపై ఆందోళనలు, దాన్ని నిర్మించతలపెట్టిన ఫ్రెంచ్‌ సంస్థ ఆర్థిక యోగ్యతల దృష్ట్యా ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలని పలువురు రాజకీయ నేతలు ప్రదాని మన్మోహన్‌సింగ్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఆయనకు ఓ లేఖను రాశారు. ఆ లేఖలో ”కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల తీరు పై మేం ఆందోళన చెందుతున్నాం” అని పేర్కొన్నారు. ఆ లేఖపై ప్రకాశ్‌ కారత్‌, సీతారం ఏచూరి, ఏబీ బర్దన్‌, డీ.రాజా, రాంవిలాస్‌ పాశాన్‌, నామా నాగేశ్వరరావు, కె.దానిష్‌ అలీ సంతకాలు చేశారు.