ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు: బొత్స
హైదరాబాద్: ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ శాంతిభద్రత విషయంలో రాజీ పడేదిలేదని స్పష్టం చేశారు. మతతత్వ శక్తులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని బొత్స తేల్చి చెప్పారు.