ప్రసార భారతి మాజీ సీఈఓ పై అవినీతి కేసు మూసివేత

న్యూఢిల్లీ: కామన్‌వెల్త్‌ క్రాడల ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ప్రసార భారతి మాజీ సీఈఓ బి.ఎన్‌.లల్లి పై సమోదైన మోసం, నేరపూరిత కుట్ర కేసులను మూసి వేయాలని సీబీఐ నిర్ణయంచింది. కేసులో దాఖలైన అభియోగాలను బలపరిచే గట్టి ఆధారాలు దర్మాప్తులో లభించలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. దీంతో త్వరలో సంబంధిత కోర్టులో మూసివతే నివేదిక దాఖలు చేయనున్నట్లు వివరించాయి.
గత ఏడాది లల్లితో పాటు ఢిల్లీకి చెందిన జూమ్‌ కమ్యూనికేషన్‌ ఎండీ వసీం డెల్వీలపై సెక్షన్‌ 120 బీ (నేరపూరిత కుట్ర) 420 (మోసం) కింద అభియోగాలను సీబీఐ దాఖలు చేసింది. వసీం బ్రిటన్‌కు చెందిన ఎన్‌ఐఎన్‌ లైవ్‌ లోనూ రెసిడెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కామన్‌ వెల్త్‌ క్రీడల ప్రొడక్షన్‌ కవరేజి కోసం రూపాయలు 246 కోట్లకు కాంట్రాక్టును ఎన్‌ఐఎన్‌ లైవ్‌కు ఇవ్వగా.. అందులో ఎక్కువ భాగాన్ని ఆ సంస్థ రూ.76 కోట్లకు జామ్‌ కమ్యూనికేషన్స్‌కు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చిందని సీబీఐ లోగడ ఆరోపించింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అయితే ఈ కేసుపై ఏడాది పాటు దర్యాప్తు చేశాక ఈఆంశాల్లో పెద్ద ఉల్లంఘనలేమీ లేవని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. చెల్లింపుల ప్రణాళికను ఎన్‌ఐఎన్‌ లైవ్‌కు అనుగుణంగా ప్రసార భారతి మార్చలేదని తేల్చింది. ముసాయిదా కాంట్రాక్టును ఎన్‌ఐఎన్‌ లైవ్‌కు అనుకూలంగా మార్చినట్లు వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ .. తుది కాంట్రాక్టును సొలిసిటర్‌ జనరల్‌ ఖరారు చేశారని, దీన్ని సమాచార ప్రసార శాఖలోనిపర్యవేక్షణ కమిటీ ఆమోదించిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ కాంటాక్టు ఎన్‌ఐఎన్‌కు లబ్ధి చేకూర్చిదిగా ఉన్నట్లు భావించినా దాని రూపకల్పన ఒక సామూహిక పాలనాపరమైన నిర్ణయమని తెలిపాయి.
కామన్‌వెల్త్‌ క్రీడల్లో అవకతవకలపై ఏర్పాటైన ఘుంగ్లు కమిటీ, కేబినెట్‌ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్‌ ఇచ్చిన నివేధిక ఆధారంగా ఈ కేసును ప్రధాన మంత్రి కార్యాలయం.. సీబీఐకి నివేధించింది.