ప్రియురాలిని చంపిన ప్రియుడి అరెస్టు

విజయవాడ: ప్రియురాలికి బలవంతంగా పురుగులమందు తాగించి ఆమె మృతికి కారకుడైన యువకుడిని పడమట పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ద్వారకా తిరుమలకు చెందిన వంశీకృష్ణ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మౌనిక ఏలూరులోని ఎస్వీపీజీ కాలేజీలో కలిసి ఎంబీఏ చదివారు. ఆ సమయంలో పరస్పరం ప్రేమించుకున్నారు. అతను విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె విజయవాడ వచ్చి పెళ్లిచేసుకోమని కోరింది. ఆమెను బైక్‌ మీద ఎక్కించుకుని తాడేపల్లిగూడెం పూళ్లగ్రామం వద్ద ముందుగా పురుగుమందు కలిపిఉంచిన థమ్స్‌ ఆప్‌ తాగించాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలివచ్చేశాడు. ఓ ఆటోడ్రైవర్‌ చూసి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రితో చేర్పించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై అనుమానం వ్యక్తం చేయటంతో అతన్ని అరెస్టుచేశారు.