బంద్‌లకు పిలుపివ్వడం సరికాదు : బీసీ సంఘాల ఐకాస

హైదరాబాద్‌: తెలంగాణ కోసం రాజకీయంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి తప్ప బంద్‌లకు పిలుపునివ్వడం సరైంది కాదని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస రాజకీయ పార్టీలకు సూచించింది. బంద్‌ల వల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోందని .. ఉపాధి కరవై వస్తులుండాల్సిన దుస్థీతి ఏర్పడుతోందని తెలంగాణ బీసీ సంఘాల ఐకాస చైర్మన్‌ ఓరుగంటి వెంకటేశంగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకునేది లేదన్న ఆయన నెల రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ వ్యక్తం చేశారు.