బస్సు బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌- నాగార్జున సాగర్‌ రహదారిపై మాల్‌ సమీపంలో చింతపల్లి మండలం గోరకొండ వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో  ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు.ఉదయగిరి డిపోకు చెందిన బస్సు నిజమాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డావరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.