బి ఆర్ ఎస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటాం
: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ రూరల్ మార్చి 21 జనం సాక్షి
బి ఆర్ ఎస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆదుకుంటామని వికారాబాద్ జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు సోమవారం ధారూర్ మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త *P. శ్రీనివాస్గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించగా, ఈరోజు వారి కుటుంబ సభ్యులకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రమాద భీమా 2,00,000రూపాయలు రెండు లక్షలు)* చెక్కును ఎమ్మెల్యేస్వయం0గా కార్యకర్త ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.పార్టీకి సేవ చేసిన కార్యకర్త ఆకస్మికంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి పార్టీ పరంగా భరోసనిస్తూముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాద భీమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.