బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాదులు దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్‌ అక్రమ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి పిస్తోలు, 16 బెల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేదిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.